ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 21 September 2026, 7:19 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

కళాశాల ముందు బస్సులు నిలపాలి జైపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల సమస్యలు పరిష్కరించాలి: పి. సికిందర్

కళాశాల ముందు బస్సులు నిలపాలి జైపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల సమస్యలు పరిష్కరించాలి: పి. సికిందర్.

అర్జున్ సమాచారం. సెప్టెంబర్ 21. (స్టాఫ్ రిపోర్టర్) మంచిర్యాల జిల్లా.

జైపూర్, సెప్టెంబర్ 21:జైపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు అనేక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పీడీఎస్‌యూ జిల్లా ఉపాధ్యక్షుడు పి. సికిందర్ అన్నారు. సోమవారం జైపూర్‌లో ఆయన మాట్లాడుతూ కళాశాల ముందు ఆర్టీసీ బస్సులు నిలపకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కళాశాల ముందు బస్సులు నిలిపితే విద్యార్థుల ప్రయాణ దూరం తగ్గుతుందని పేర్కొన్నారు.
కళాశాలలో క్రీడా స్థలం ఉన్నప్పటికీ క్రీడలకు అనుకూలంగా లేకపోవడంతో విద్యార్థులు క్రీడలకు దూరమవుతున్నారని అన్నారు. ఆట స్థలాన్ని క్రీడలకు అనుకూలంగా తీర్చిదిద్దాలని కోరారు.
కళాశాల చుట్టూ ప్రహరీ గోడ లేకపోవడంతో అసాంఘిక కార్యక్రమాలు చోటుచేసుకునే అవకాశం ఉందని తెలిపారు. దీనివల్ల మహిళా విద్యార్థులు, అధ్యాపకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. వెంటనే కళాశాల చుట్టూ ప్రహరీ గోడ నిర్మించాలని డిమాండ్ చేశారు.
కళాశాలలో తాగునీటి శుద్ధి పరికరం ఉన్నప్పటికీ పనిచేయకపోవడంతో విద్యార్థులు బయట నుంచి నీటిని తెచ్చుకోవాల్సి వస్తోందని తెలిపారు. వెంటనే పరికరానికి మరమ్మతులు చేయించి విద్యార్థులకు నాణ్యమైన తాగునీరు అందించాలని కోరారు.
జైపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని సమస్యలపై సంబంధిత అధికారులు, జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని పి. సికిందర్ డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో పీడీఎస్‌యూ జిల్లా కోశాధికారి జి. సౌమ్య, జిల్లా నాయకులు అక్షయ, కేవీ చారి, స్వప్న, శ్వేత, కిరణ్, మహేష్, ధీరజ్, విద్యార్థులు పాల్గొన్నారు.